'సుమ అడ్డా' ఈ వారం ఫుల్ గా ఎంటర్టైన్ చేసింది. ఇక ఈ షోకి 'హంట్' మూవీ టీమ్ నుంచి సుధీర్ బాబు, భరత్, డైరెక్టర్ మహేష్ వచ్చారు. ఇక ఈ షోలో సుధీర్ బాబు తన మొబైల్ ఫోన్ లో గూగుల్ లో ఎక్కువగా ఎలాంటి విషయాలను సెర్చ్ చేశారో చూపించింది సుమ. "వైఫ్ ని ఎలా కంట్రోల్ లో పెట్టాలి" అని సెర్చ్ చేస్తే ఎం ఆన్సర్ వచ్చింది అని అడిగేసరికి "గూగుల్ నో ఆన్సర్" అని చెప్పింది అన్నారు సుధీర్. "డైట్ ఫాలో అవకుండా 12 పాక్స్ రావాలంటే ఏం చేయాలి " అన్న ప్రశ్నకు "ఏం చేయకూడదు" అని ఆన్సర్ ఇచ్చారు. "వైఫ్ కి ఈజీగా వండి పెట్టే ఫుడ్ ఏది" అని అడిగేసరికి "కాఫీ ఇస్తా" అన్నారు. "రొమాంటిక్ సీన్స్ లో సిగ్గు పడకుండా ఎలా యాక్ట్ చేయాలి అన్న"ప్రశ్నకు "అప్పుడు భరత్ కి ఫోన్ చేస్తా" అని చెప్పారు. "ఏజ్ ఎప్పటికీ పెరగకుండా యంగ్ గా ఉండాలంటే ఏం చేయాలి" అని సుమ అడిగేసరికి "అప్పుడు మీకు ఫోన్ చేసి సలహా తీసుకుంటా" అని కౌంటర్ వేసాడు. దానికి సుమ కళ్ళలో మెరుపులు కనిపించాయి. ఇది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పింది. ఇలా సరదాగా ఒక సెగ్మెంట్ సాగిపోయింది.
ఇక ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెగ్మెంట్ ని కొంచెం లోతుగా పరిశీలిస్తే గనక ఒక విషయం అర్ధమవుతోంది. ఇది ఒక కొత్త ఫార్మాట్. విడిగా కార్డ్స్ మీద ప్రశ్నలు రాసుకొచ్చి అడగడం అనేది అరిగిపోయిన స్ట్రాటజీ కాబట్టి మొబైల్ ఫోన్ లో ఏం సెర్చ్ చేస్తున్నారో తెలుసుకుంటే బాగుంటుంది అనే ఒక ఫార్ములా అందరిలో ఒక ఆసక్తిని క్రియేట్ చేస్తుంది..ఆ వైపుగా ఆలోచించిన ఈ షో మేకర్స్ దాన్ని ఫాలో అవుతూ వెళ్తున్నారు. హోస్ట్ అడిగే ప్రశ్నలను షూటింగ్ టైములోనే గెస్ట్స్ మొబైల్ లో సెర్చ్ చేసి పెట్టుకుంటారు. ఇక షోలోకి వచ్చేసరికి యాంకర్ అడగాల్సిన ప్రశ్నలు అవే కాబట్టి వాటికి ఆన్సర్స్ ఇచ్చేస్తున్నారు వచ్చిన వాళ్ళు. సోషల్ మీడియా పెరిగిపోయాక ఆడియన్స్ ని మెప్పించడానికి ఎన్ని రకాలు కావాలో అన్ని రకాల ట్రిక్స్ ని ప్రయోగిస్తున్నారు.